పురుషుల్లో ఆ సమస్య.. మగ పిల్లలు పుట్టరా?

పురుషుల శరీర నిర్మాణంలో కీలక పాత్ర పోషించే అంశాల్లో Y క్రోమోజోమ్ ఒకటి. మగ శిశువుల పుట్టుకకు ఈ క్రోమోజోమ్ అత్యంత అవసరం. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ పురుషుల శరీరంలోని కొన్ని కణాలు ఈ Y క్రోమోజోమ్‌ను కోల్పోతాయని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. ఆ సమయంలో దీనివల్ల పెద్దగా హానీ ఉండదని భావించారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనలు మాత్రం భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. వైద్య పరిశోధనల ప్రకారం.. వయసుతో పాటు కొన్ని రక్తకణాల్లో Y క్రోమోజోమ్ పూర్తిగా లేదా భాగంగా కనిపించకుండా పోవడం జరుగుతుందట. దీనిని శాస్త్రీయంగా ‘లాస్ ఆఫ్ Y’ (Loss of Y) అని పిలుస్తారు. ఇది కేవలం...