ఆటోలో ఎక్కిన ప్రభుత్వ టీచర్ను పక్కకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డ డ్రైవర్
ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ మహిళా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేయడం కలకలం రేపుతోంది. పాఠశాలకు వెళ్లేందుకు సాధారణంగా ఎక్కిన ప్రయాణమే ఆమెకు ప్రాణాపాయం తీసుకువచ్చింది. నగల కోసం ప్రాణాలకు తెగబడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. గూడూరుకు చెందిన హరిత (35) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె బాలాయపల్లి మండల పరిధిలోని గొట్టిగాడి గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ గూడూరు నుంచి పాఠశాలకు ప్రయాణిస్తూ విధులు నిర్వర్తించేవారు. అయితే ఈ ఉదయం కూడా ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆమె ఒంటిపై...