మహిళల పేరుపై వాహనం కొంటే, లోన్‌పై తక్కువ వడ్డీ వస్తుందా?
ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల నుంచి పై స్థాయి వర్గాల వరకు చాలామంది కారును కొనుగోలు చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో కార్ లోన్‌ను కుటుంబంలోని పురుషుల పేరుపైనే తీసుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో, మహిళల పేరుతో కార్ లోన్ తీసుకోవడం ద్వారా పొందగలిగే ప్రయోజనాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. కుటుంబంలో సంపాదించే మహిళ పేరు మీద వాహన రుణం తీసుకుంటే ఆర్థిక పరంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి. మహిళ పేరు మీద కార్ లోన్ తీసుకోవాలంటే ముందుగా ఆమెకు నిర్దిష్టమైన ఆదాయ వనరు ఉండాలి....