Municipal elections: ఓట్ల లెక్కింపు ప్రారంభం
* ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం * 123 కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు * 116 మున్సిపాలిటీల్లో ఉత్కంఠభరిత పోటీ Municipal elections: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పండుగలో కీలక ఘట్టంగా భావించే ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, అభ్యర్థులు, వారి అనుచరులు ఉత్కంఠగా ఎదురుచూశారు. మొత్తం 116 మున్సిపాలిటీల పరిధిలోని 2,569 వార్డుల నుంచి 10,179 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 డివిజన్ల నుంచి 2,225 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా...