Sexual Wellness: శృంగారంలో మహిళలకు భావప్రాప్తి కలగకపోవడానికి కారణాలు ఏంటి?

Sexual Wellness: దాంపత్య జీవితంలో శృంగారం ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతున్నప్పటికీ, ప్రతి మహిళా శృంగారంలో సంపూర్ణ సంతృప్తి లేదా భావప్రాప్తిని అనుభవించలేకపోతున్నారనే విషయం నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్య నిపుణులు మరియు సెక్సాలజీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. గతంలో ఎదురైన చెడు అనుభవాలు మహిళల శృంగార జీవితంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. అవమానకర సంఘటనలు, భయాలు, అసురక్షిత భావనలు వంటి అంశాలు మనసులో మిగిలి ఉండి, కలయిక సమయంలో అవగాహన లేకుండానే అడ్డంకులుగా మారుతాయని వారు సూచిస్తున్నారు. శృంగారం శారీరక చర్య మాత్రమే కాకుండా భావోద్వేగ అనుబంధంతో కూడిన ప్రక్రియ కావడంతో, మనసులోని ఆందోళనలు సంతృప్తిని తగ్గిస్తాయని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, రోజువారీ జీవితంలోని...