Accreditation: ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Accreditation: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మల్సూర్‌లతో కలిసి అక్రిడిటేషన్ ప్రక్రియపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జీవోల్లో సవరణలు- పారదర్శక విధానం.. అక్రిడిటేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం తొలుత జీవో 252ను జారీ చేసిందని మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాల సూచనల మేరకు సవరణలు చేసి జీవో 103ను...