TGSET 2026 హాల్ టికెట్లు విడుదల

TGSET 2026: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ సెట్-2026)కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసినట్లు టీజీ సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో టీజీసెట్-2026 నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా టీజీఎస్‌డబ్ల్యూఆర్, టీజీటీడబ్ల్యూఆర్, ఎంపీజేపీటీబీసీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ సొసైటీలలో 5వ తరగతి ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంపీజేపీటీబీసీడబ్ల్యూఆర్ సొసైటీలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు...