Telangana: రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
* ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు * కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత * సెక్షన్ 163 అమలు- నిషేధాజ్ఞలు జారీ * పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమయ్యే లెక్కింపు Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు నిర్ణీత కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అవసరమైన సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, సిబ్బందిని ఇప్పటికే నియమించారు. శాంతిభద్రతల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద...