Names: ఈ రైల్వేస్టేషన్ల పేర్లు మీకు నవ్వు తెప్పిస్తాయి!

Names: భారతదేశం వంటి విస్తారమైన దేశంలో రైల్వే నెట్‌వర్క్ ఎంత పెద్దదో, అంతే వైవిధ్యభరితంగా ఇక్కడి రైల్వేస్టేషన్ల పేర్లు కూడా కనిపిస్తాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంటే కిటికీ బయట కనిపించే స్టేషన్ బోర్డులు ఒక్కోసారి చిరునవ్వు తెప్పిస్తాయి. ఇంకోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని పేర్లు పలకడానికి సులభంగా ఉండగా, మరికొన్ని పేర్లు చదవడానికే రెండు సార్లు ప్రయత్నించాల్సి వస్తుంది. “మనమే తప్పుగా చదివామా? లేక స్టేషన్ పేరే ఇంత విచిత్రంగా ఉందా?” అనే సందేహం కలిగే సందర్భాలు కూడా ఉంటాయి. రైల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ స్టేషన్ పేరు తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ముఖ్యంగా కొత్త ప్రాంతాలకు వెళ్లేవారు కిటికీ దగ్గర...