ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఎంత నిరాశలో ఉన్నా ఒక్కసారి వింటే రిలాక్స్ అయిపోతారు

పాట అనగానే మనసుకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంశాలు లిరిక్స్, సంగీతం. కొందరికి బీట్ ముఖ్యమైతే, మరికొందరికి పదాలు ప్రాణం. స్వరాల మాధుర్యంతో మనసును మత్తెక్కించే పాటలు ఒకవైపు ఉంటే, అక్షరాల ఆలోచనలతో మనలో మార్పు తీసుకొచ్చే గీతాలు మరోవైపు నిలుస్తాయి. ముఖ్యంగా తెలుగులో వచ్చిన కొన్ని గేయాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని అలవర్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి పాటలు వినగానే మనసులోని భారాలు కరిగిపోతాయి. క్షణకాలం అయినా సమస్యలన్నీ దూరమైపోయినట్టుగా అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో ఒత్తిడులు, నిరాశలు, వైఫల్యాలు ఎదురైనప్పుడు “ఇంతేనా జీవితం?” అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ తలెత్తుతుంది. అటువంటి...