Vida UBEX: ఎలక్ట్రిక్ బైక్ రంగంలో హీరో భారీ అడుగు
Vida UBEX: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో పోటీ రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్న వేళ, దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘విడా’ ద్వారా మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన ఉనికిని బలపరుచుకుంటున్న ఈ సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల మార్కెట్‌పై దృష్టి సారించడం విశేషం. ఈ క్రమంలో విడా ఉబెక్స్ (Vida UBEX) పేరుతో రూపొందించిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు భారత్‌లో డిజైన్ పేటెంట్ లభించడం రంగంలో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం 2026 నాటికి ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా...