అబ్బో.. మాములుగా లేదుగా ఇతడి కథ.. టిప్ టాప్‌గా తిరుగుతాడు, ఇళ్లను గుల్ల చేసేస్తాడు!
వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి.. కానీ ప్రవృత్తిగా పక్కా దొంగ. వెలుపల చూస్తే టిప్‌టాప్ డ్రెస్సింగ్, విలాసవంతమైన కారు, స్నేహితులతో పార్టీలు.. ఇలా ఒక హైఫై లైఫ్ స్టైల్. కానీ ఆ విలాసాల వెనుక దాగి ఉన్న అసలు కథ మాత్రం షాకింగ్. విశాఖ నగరాన్ని వణికించిన ‘ముసుగు దొంగ’గా పేరుపడ్డ యువకుడు చివరకు పోలీసుల వలలో చిక్కాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 ఇంటి దొంగతనాలకు పాల్పడి నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నేరాల చిట్టా బయటపడడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ విశాఖలోని...