Good news: మద్యం ప్రియులకు కిక్ ఎక్కించే వార్త

Good news: భారత్- అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక రంగంలో సరికొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ మెగా డీల్‌తో ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొత్త మైలురాయిని తాకాయి. సాధారణ వినియోగదారుడి నుంచి వ్యాపార వర్గాల వరకు అందరికీ లాభం చేకూరేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకోవడం విశేషంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం.. దేశీయ మార్కెట్‌కు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను తెరలేపింది. వినియోగం పెరగడం, ధరలు తగ్గడం, ఎగుమతులు విస్తరించడం వంటి అనేక అంశాలు ఒకేసారి దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించనున్నాయని నిపుణులు అంచనా...