Shocking Incident: తల్లిలాంటి అత్తపై అత్యాచారం.. ఆపై హత్య

Shocking Incident: అత్యంత పవిత్రంగా భావించాల్సిన కుటుంబ బంధాలను మద్యం మత్తు భయంకరంగా కాల్చేసిన సంఘటన ఇది. కూతురి కాపురం బాగుండాలన్న ఒక్క ఆలోచనతో ఆశ్రయం ఇచ్చిన అత్తపై, అదే ఇంట్లో పెరిగిన అల్లుడు మృగంలా మారాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. రఘుపతిపేట గ్రామానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తికి రేణుకతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయిన మొదట్లో జీవితం సాదాసీదాగా సాగినప్పటికీ, కాలక్రమేణా రాఘవేందర్ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవలు పెట్టుకోవడం, అనుమానాలు వ్యక్తం చేయడం అతడి నిత్యకృత్యంగా...