Esther Noronha: ‘ఈ ఏజ్‌లోనూ గోకుతున్నారు’

Esther Noronha: సినిమా పరిశ్రమ అనగానే చాలామందికి అది కలల ప్రపంచంగా కనిపిస్తుంది. వెలుగులు, కెమెరాల ఫ్లాష్‌లు, భారీ ఫాలోయింగ్‌, పేరు ప్రఖ్యాతులు చూసి సామాన్యులలో ఎందరో తామూ సినీతారలుగా మారాలని ఆశపడతారు. ఆ ఆశతోనే చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి నగరాల వైపు ప్రయాణమవుతారు. కానీ సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాతే అసలు నిజం అర్థమవుతుందని పలువురు నటీనటులు చెబుతుంటారు. అవకాశాలు అంత ఈజీగా రావని, టాలెంట్‌తో పాటు రాజీలు, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయని అనుభవాలు చెబుతున్నాయి. అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని కొందరు కీలక స్థానాల్లో ఉన్నవారు నటీమణుల జీవితాలతో ఆడుకుంటున్నారన్న ఆరోపణలు కొత్తవేమీ కావు....