Sports: సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు ఐదు బంగారు పతకాలు

Sports: కొలంబో వేదికగా జరిగిన సౌత్ ఏషియా సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో భారత క్రీడా చరిత్రలో మరో స్వర్ణాధ్యాయం చేరింది. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు, పురుషుల జట్టు అసాధారణ ప్రదర్శనతో ఐదు బంగారు పతకాలను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాయి. ఆసియా స్థాయిలో అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందుతున్న సెపక్ టక్రా క్రీడలో భారత ఆటగాళ్లు చూపిన సత్తా అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఘన విజయాలపై సెపక్ టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్ స్పందిస్తూ.. ఇది కేవలం పతకాల విజయం మాత్రమే కాకుండా, భారత క్రీడా భవిష్యత్తుకు సంకేతమని పేర్కొన్నారు....