‘ఆపరేషన్ జాక్’ విజయవంతం.. భారీ మగ పులిని పట్టుకున్న రెస్క్యూ టీమ్ (VIDEO)
తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసి, అటవీ అధికారులకు నిద్రలేకుండా చేసిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. ‘ఆపరేషన్ జాక్’ పేరుతో చేపట్టిన ప్రత్యేక చర్యలు విజయవంతం కావడంతో, కూర్మాపురం ప్రాంతంలో ఈ భారీ మగ పులిని అటవీ శాఖ అధికారులు సురక్షితంగా బంధించి విశాఖపట్నంలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ (ఏఆర్సి)కు తరలించారు. ప్రస్తుతం ఈ పెద్దపులి అక్కడ కఠిన భద్రత, ప్రత్యేక వైద్య పర్యవేక్షణ మధ్య సంరక్షణ పొందుతోంది. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగిన పులి ఒక్కసారిగా బోనులోకి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురైందని అధికారులు చెబుతున్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం అవసరమవుతుందని స్పష్టం చేస్తున్నారు. https://twitter.com/tupaki_official/status/2019774444450054424?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2019774444450054424%7Ctwgr%5E5e3a6deb862c58c3fdc07a9745f8001f7cbd26bd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Ftupaki_official%2Fstatus%2F2019774444450054424 ఏఆర్సి...