XElectron Techno: రూ.6 వేలలోనే బిగ్ స్క్రీన్.. టీవీలకు చెక్ పడినట్లేనా?

XElectron Techno: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ బలంగా ఉంది. కానీ ఆ కలను నిజం చేయాలంటే భారీ ఖర్చు తప్పదనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా 100 అంగుళాలు, 150 అంగుళాలు లేదా 200 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కొనాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిమిత బడ్జెట్‌తోనూ బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించే మార్గం ఏదైనా ఉందా అంటే.. సమాధానం అవుననే చెప్పాలి. కేవలం రూ.6 వేల లోపలే ఇంట్లో సినిమా థియేటర్ ఫీలింగ్ తీసుకొచ్చే ఒక ఆసక్తికరమైన గ్యాడ్జెట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అదే XElectron...