Super Food: మునగాకు సూప్.. ఎలా చేయాలో తెలుసా?

Super Food: మునగాకు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆరోగ్యం. మన సంప్రదాయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మునగాకు పోషకాల గని అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల దీన్ని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. రోజువారీ ఆహారంలో మునగాకును ఏదో ఒక రూపంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సహజంగానే అందుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తపోటును నియంత్రించడం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు మునగాకు వల్ల లభిస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ,...