Citroen Basalt X: ఈ కారును మీరు చూశారా మావ?.. బడ్జెట్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ

Citroen Basalt X: టాటా కర్వ్ (Tata Curvv) లాంటి కూపే స్టైల్ ఎస్‌యూవీని చూసి “ఇది నా బడ్జెట్‌కు కాస్త ఎక్కువే” అని ఆలోచిస్తున్నవారికి ఇప్పుడు మార్కెట్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయం వచ్చేసింది. అదే సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ (Citroen Basalt X). స్టైలిష్ డిజైన్, ప్రీమియం లుక్, ఆధునిక ఫీచర్లు అన్నీ ఉన్నప్పటికీ ధర విషయంలో మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సిట్రోయెన్ ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ.8.15 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కూపే ఎస్‌యూవీ ఇప్పుడు కార్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా టాటా కర్వ్‌ను కొనాలనుకునే కానీ బడ్జెట్ అడ్డుగా...