Chanakya Neeti: వీళ్లు జీవితంలో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు.!
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులు నేటికీ మన జీవితాలకు అద్దం పడతాయి. మనిషి జీవితంలో సంతోషం అనేది ఎంత డబ్బు, హోదా, సౌకర్యాలు ఉన్నాయన్నదానిపై కాదు.. అతని ఆలోచనా విధానం, అలవాట్లు, స్వభావంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చాణక్య నీతి స్పష్టం చేస్తుంది. బయటికి అన్నీ ఉన్నట్టు కనిపించినా, లోపల మాత్రం ఎప్పుడూ అసంతృప్తితో, అసహనంతో జీవించే వారు కొందరు ఉంటారు. అలాంటి వారు జీవితాంతం సంతోషాన్ని అనుభవించలేరని చాణక్యుడు హెచ్చరించారు. వారి దుఃఖానికి కారణం విధి కాదు, పరిస్థితులు కాదు.. వారి స్వంత అలవాట్లేనని నీతిశాస్త్రం చెబుతోంది. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులు ఎప్పుడూ తమ జీవితంపై అసంతృప్తిగానే ఉంటారు....