మల్లెపూల మాదిరిగా మెత్తటి ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసా?
ఇంట్లో ఇడ్లీలు చేయడం సులభమేనని చాలామంది భావిస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే మల్లెపూల మాదిరిగా దూది లాంటి మెత్తటి ఇడ్లీలు రావడం ఒక ప్రత్యేకమైన కళే. కొన్నిసార్లు అన్ని విధాలా శ్రద్ధగా చేసినా ఇడ్లీలు మరీ మెత్తగా అయిపోవడం, లేకపోతే రాయిలా గట్టిగా మారడం జరుగుతుంటుంది. దీనికి కారణం వండే పద్ధతి కంటే ఎక్కువగా ఇడ్లీ పిండిని సిద్ధం చేసే విధానమే. అసలు రహస్యం అంతా పిండిలోనే దాగి ఉందని వంట నిపుణులు చెబుతున్నారు. సరైన నిష్పత్తులు, సరైన పద్ధతులు పాటిస్తే హోటల్ తరహా అద్భుతమైన ఇడ్లీలు ఇంట్లోనే సిద్ధమవుతాయి. ఇడ్లీలు ఎలా వస్తాయనేది ప్రధానంగా బియ్యం, మినప్పప్పు నానబెట్టే విధానం, పిండి రుబ్బే పద్ధతి,...