తల్లి బొడ్డుతాడులో ప్లాస్టిక్ కణాలు.. ఎలా చేరాయి?

పాలిథిన్ కవర్లలో అమ్మే ఉప్పు, పంచదారతో పాటు మార్కెట్‌లో లభించే మంచినీటి బాటిళ్లలో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ అంశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా మద్రాస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. భవిష్యత్ తరాల ఆరోగ్యంపై ఈ మైక్రోప్లాస్టిక్‌లు తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని న్యాయస్థానం కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, పాలిథిన్ ప్యాకెట్లలోని ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిపై ప్రజలను హెచ్చరించేలా స్పష్టమైన లేబుళ్లు తప్పనిసరిగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి కారణమైన పరిశోధన...