ఇదేం పక్షిరా బాబు?.. పామును పొడిచి పొడిచి చంపింది (VIDEO)

చూడటానికి కోకిలను తలపించినా, ఇది సాధారణ కోకిల కాదు. ప్రకృతిలో అరుదుగా కనిపించే ఈ పక్షిని షణ్ముగ కాకి అని పిలుస్తారు. కొందరు ప్రాంతాల్లో దీనిని సాంబార్ కాకి, జముడు కాకి అనే పేర్లతోనూ వ్యవహరిస్తారు. ఆకారంలో కోకిలతో పోలిక ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల ఈ పక్షి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. సాధారణ కోకిలకు ఎర్రటి కళ్లుంటే, షణ్ముగ కాకికి మాత్రం నల్లటి కళ్లు ఉండటం దీని ప్రధాన గుర్తింపుగా చెప్పుకుంటారు. ఈ ఒక్క లక్షణమే కాకుండా, దీని ప్రవర్తన, జీవన శైలి, మనుషులతో ఉండే దూరం అన్నీ దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. https://youtu.be/BCq7Bt2CgCk షణ్ముగ కాకి సాధారణంగా జనావాసాలకు దూరంగా, గ్రామాల...