స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌కు ఏర్పడిన హైప్ చూస్తుంటే, ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా ఓ ఈవెంట్‌లా మారబోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత తారక్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి పీక్స్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ రా యాక్షన్, డార్క్ టోన్, పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ అన్నీ కలిసివస్తుండటంతో ‘డ్రాగన్’పై చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్...