సాయిరూప చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

స్టార్ త్రినేత్రం, వేములవాడ: వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ రాజన్న ఆలయం ఆవరణలో ఆదివారం భక్తులకు, యాచకులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. సాయిరూప చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీతో పాటు వాటర్‌ బాటిల్స్‌ అందజేసే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న యాచకులు ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. భక్తి, సేవా భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ట్రస్ట్‌ నిర్వాహకులు పిల్లీ బాబురావు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో తమ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దాతల సహకారంతో వారి పేరుపేరునా అన్న ప్రసాదం, వాటర్‌...