Municipal elections: ‘కమలం గుర్తుకు ఓటేసి కల్యాణిని గెలిపించండి’
Municipal elections: మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో పట్టణ కేంద్రంలోని 10వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థి తుమ్మల కల్యాణి సోమవారం ఉదయం నుంచే విస్తృత ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే ప్రచారం ప్రారంభించిన ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. వార్డు పరిధిలోని వీధులు, కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. బీజేపీ సర్కార్ ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న నినాదంతో ముందుకు సాగారు. వర్ధన్నపేట...