‘పవన్ సార్. నన్ను చంపేయండి’.. ఎమ్మెల్యే బాధితురాలి మరో వీడియో
జనసేన విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ మరో వీడియోను విడుదల చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి, విప్ హోదా లేకుండా శ్రీధర్ ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటే తనకు చేసిన ద్రోహానికి ఈ పాటికే అరెస్టై జైలులో ఉండేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నాడనే కారణంతోనే అతడు ధైర్యంగా బయట తిరుగుతున్నాడని ఆరోపించారు. https://twitter.com/RTVnewsnetwork/status/2020421585451311608?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020421585451311608%7Ctwgr%5E1c9d49474a4d3560d5813767c32ee6dcf503b00e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FRTVnewsnetwork%2Fstatus%2F2020421585451311608 ఈ ఘటనను బట్టి చూస్తే ఈ విషయంపై అందరూ రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని హర్షవీణ వ్యాఖ్యానించారు. అయితే అధికారాన్ని ఉపయోగించుకుని జరిగిన అంశాన్ని రాజకీయంగా మలుస్తోంది మాత్రం శ్రీధర్నేనని, తాను ఎలాంటి పాలిటిక్స్ చేయట్లేదని స్పష్టం చేశారు....