Valentine's Day: భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

Valentine's Day: వాలెంటైన్స్ డే అంటే ఇకపై పువ్వులు, చాక్లెట్లు, విందులకే పరిమితం కాదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రేమికులు ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా మార్చుకోవడానికి ప్రయాణాలు, విహారయాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. హోటల్, ట్రావెల్ రంగాలకు సంబంధించిన డేటా ప్రకారం వాలెంటైన్స్ డే వీకెండ్‌లో బుకింగ్‌లు ఊహించని స్థాయిలో పెరిగాయి. భారతీయ జంటలు లగ్జరీ, అనుభవాలపై ఖర్చు చేయడానికి వెనకాడటం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. క్లియర్‌ట్రిప్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా హోటల్ బుకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 175 శాతం పెరిగాయి. క్లియర్‌ట్రిప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్...