చికెన్‌ను స్కిన్‌తో పాటు తింటున్నారా? అది లాభమా? నష్టమా?

ఆదివారం రాగానే మాంసం షాపుల వద్ద సందడి మొదలవుతుంది. చికెన్‌, మటన్‌ కోసం చాలా మంది ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వైపు ఓ చూపు వేసి, కావాల్సిన పరిమాణాన్ని ఆర్డర్‌ చేయడం సాధారణంగా కనిపించే దృశ్యం. ఈ క్రమంలో చికెన్‌లో స్కిన్‌ ఉన్న కోడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే వారు కూడా కొరవడటం లేదు. చర్మంతో కూడిన కోడిని తీసుకుని, గ్యాస్‌ స్టౌలపై లేదా ఎలక్ట్రిక్‌ స్టౌలపై కాల్చించి మరీ ముక్కలు చేయించుకునే ట్రెండ్‌ పెరుగుతోంది. అయితే ఇలా ఏరికోరి తీసుకెళ్లే స్కిన్‌ చికెన్‌ నిజంగానే ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదన్న ప్రశ్న ఇప్పుడు చాలామందిని వెంటాడుతోంది. స్కిన్‌ చికెన్‌ తినాలా? వద్దా? అన్నదానిపై ఎన్నో...