Municipal Elections: 8వ వార్డులో కాంగ్రెస్ ప్రచార హోరు
పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ఇంటింటి ప్రచారానికి దిగిన కాంగ్రెస్ నేతలు ప్రజల మద్దతు కోరుతున్న 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ అభ్యర్థి వెంట తరలివచ్చిన మద్దతుదారులు Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట పట్టణకేంద్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని పొద్దుపొద్దున్నే ముమ్మరం చేసింది. ఆదివారం రోజున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో ఈ ప్రచారం సాగింది. వార్డు పరిధిలోని పలు...