Nakka Srinivas Yadav: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకే 'ప్రతిభా పాటవ పరీక్ష

స్టార్ త్రినేత్రం, వనస్థలిపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడి రాణించాలనే లక్ష్యంతోనే ప్రతిభా పాటవ పరీక్షలను నిర్వహిస్తున్నామని నక్క వెంకటమ్మ యాదవ్- నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం, నక్క ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని కర్ణాటి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయడమే ఈ తరహా పరీక్షల ప్రధాన ఉద్దేశమని నక్క శ్రీనివాస్...