CI Latif: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం
స్టార్ త్రినేత్రం, సిద్ధిపేట: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారుతున్నాయని తొగుట సీఐ లతీఫ్ స్పష్టం చేశారు. శనివారం కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్‌తో కలిసి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీసీ కెమెరాల అవసరం, వాటి ఉపయోగాలపై వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. ప్రతి గ్రామంలో ముఖ్య కూడళ్లు, రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే...