అండర్-19 ప్రపంచకప్ విజేతలకు BCCI భారీ బహుమతి

భారత అండర్-19 క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. ఆరోసారి టైటిల్ గెలిచి భారత యువకులు చరిత్ర సృష్టించడంతో క్రికెట్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ ఘన విజయాన్ని గుర్తిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన భారత అండర్-19 జట్టుకు రూ.7.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. యువ ఆటగాళ్ల కష్టానికి, అంకితభావానికి ఇది సరైన గౌరవమని బీసీసీఐ పేర్కొంది. ఫిబ్రవరి 6న జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నమెంట్ మొత్తం అజేయంగా కొనసాగిన...