BRS: 1వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న తుమ్మల యాకయ్య

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో గులాబీ జెండానే ఎగురుతుందని, కచ్చితంగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని బీఆర్ఎస్ 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తుమ్మల యాకయ్య ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని 1వ వార్డులో శనివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలబడి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచార అనంతరం మాట్లాడిన తుమ్మల యాకయ్య, ప్రస్తుత పాలకుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత...