అందుబాటులో ఉంటా.. అభివృద్ధిని చూపిస్తా: ఈగ దామోదర్

- ప్రతిపక్షాలు బేజారు.. దూసుకుపోతున్న ఈగ దామోదర్ - మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను - నన్ను ఆశీర్వదించండి..కౌన్సిలర్‌గా గెలిపించండి.. - ప్రచారంలో అడుగడుగునా ఈగ దామోదర్‌కి అపూర్వ స్పందన - గెలుపు ఖాయం అంటున్న ప్రజలు స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుండగా, ప్రతిపక్షాలను పూర్తిగా వెనక్కి నెట్టేస్తూ హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఈగ దామోదర్ ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వార్డు అభివృద్ధిపై తన ఆలోచనలను స్పష్టంగా వివరిస్తున్నారు....