ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి: కలెక్టర్ సత్య శారద
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య శారద అన్నారు. శుక్రవారం వర్ధన్నపేట రైతు వేదికలో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్స్‌ల సీలింగ్ ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం, తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం...