అనుభవం ఉంది.. ఆశీర్వదించండి: తుమ్మల యాకయ్య
1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల యాకయ్య విస్తృత పర్యటన స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రజల్లో మరింతగా కనిపిస్తూ తమ వాదనలు బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల యాకయ్య శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలు, గల్లీలు తిరుగుతూ ఇంటింటా ఓటర్లను కలుసుకుని తమ అభ్యర్థిత్వాన్ని వివరించారు. ప్రచారంలో ప్రజల స్పందనను గమనిస్తూ, వార్డులో ఉన్న సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు....