Telangana: కొత్త అక్రిడిటేషన్ దరఖాస్తులకు ఆహ్వానం
స్టార్ త్రినేత్రం, డెస్క్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన కీలక ప్రకటనను రాష్ట్ర సమాచార-పౌర సంబంధాల శాఖ చేసింది. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కమిషనర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025 ప్రకారం కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియలో స్పష్టత, పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 2025 డిసెంబర్ 22న జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.252తో పాటు,...