మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్న గులాబీ నేతలు

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. ప్రచారానికి ఇంకా కేవలం నాలుగు రోజులే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా వ్యూహాలను మరింత పదునుపెట్టాయి. ఒక్కో వార్డులో పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ తమ బలాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగరబోయిన రమా రాజశేఖర్ శుక్రవారం ఉదయం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కాలనీలు, గల్లీలు తిరుగుతూ ఓటర్లను నేరుగా...