అభివృద్ధికి ఓటు వేసి గెలిపించండి: ఈగ దామోదర్

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తిమంతమైన ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈగ దామోదర్ ప్రచార కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి రాత్రివరకు వార్డు పరిధిలోని గల్లీగల్లీ తిరుగుతూ, ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. తన వెంట మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈగ దామోదర్ ప్రతి ఇంటికి వెళ్లి స్థానికుల సమస్యలను వింటూ, వాటికి...