ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు
అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 9వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అంటే అభ్యర్థుల చేతిలో ఉన్నది కేవలం ఇవాళ్టితో కలిపి 4 రోజుల సమయమే. ఈ స్వల్ప సమయంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం కూడా వదులుకోకుండా వ్యూహాలు రచిస్తూ, ఇంటింటా ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని మొత్తం రంగంలోకి దింపగా, అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. పోలింగ్‌కు రోజులు...