Lucky draw: అదృష్టం అంటే ఇదే.. లాటరీలో రూ.49 కోట్లు జాక్‌పాట్ కొట్టాడు

Lucky draw: అబుదాబి వేదికగా నిర్వహించే ప్రతిష్టాత్మక బిగ్‌టికెట్‌ లాటరీలో భారతీయుడికి అదృష్టం వరించింది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్‌ లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం విలువ సుమారు రూ.49 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా కోట్లాది రూపాయల బంపర్‌ ఆఫర్‌ తగలడంతో శాంతను జీవితం పూర్తిగా మారిపోయింది. బిగ్‌టికెట్‌ లాటరీ ఫలితాలు వెలువడిన వెంటనే ఈ వార్త వేగంగా వ్యాపించింది. అబుదాబిలో లాటరీ డ్రా జరుగుతుండగా శాంతను పేరు విజేతగా ప్రకటించగానే అతడికి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కొన్నేళ్లుగా విదేశాల్లో పనిచేస్తూ కుటుంబ భవిష్యత్తు...