2వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు జ్యోతి నవీన్ నాయక్ ప్రచారం

బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి స్టార్ త్రినేత్రం, వర్దన్నపేట: Municipal Elections: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు జ్యోతి నవీన్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఒక్కటిగా కదిలి వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ప్రజలతో సన్నిహితంగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా బానోతు జ్యోతి నవీన్ నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం...