OTT Horror Movie: మంచి మసాలా హారర్ థ్రిల్లర్ మావా.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు

OTT Horror Movie: ప్రస్తుతం థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో కూడా డివోషనల్ టచ్‌తో పాటు హారర్ థ్రిల్లర్ సినిమాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాంతారా సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన శంభాల వరకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు.. ప్రేక్షకుల మనసుల్లో కూడా గట్టిగా ముద్ర వేసాయి. ఈ జానర్‌కు ప్రేక్షకుల్లో ఎంత స్థాయిలో ఆదరణ పెరిగిందో ఈ విజయాలు మరోసారి నిరూపించాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో, ఆచారాలు, సంప్రదాయాలు, మిస్టరీని మేళవిస్తూ తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తెరపై కనిపించే డార్క్ విజువల్స్, భయాన్ని కలిగించే నేపథ్య సంగీతం, ఉత్కంఠను పెంచే కథనం ఈ తరహా సినిమాలకు...