Golden Chance: రూ.5 వేలతో పోస్టాఫీస్ ఫ్రాంచైజీ

Golden Chance: హనుమకొండ పోస్టల్ డివిజన్ పరిధిలో ప్రజలకు పోస్టల్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియన్ పోస్ట్ ఫ్రాంచైజీ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వి. హనుమంతు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టాఫీస్ సేవలు పూర్తిగా అందని ప్రాంతాలు, లేదా ఉన్న పోస్టాఫీసులపై అధిక భారం ఉన్న ప్రాంతాల్లో ఈ ఫ్రాంచైజీల ద్వారా సేవలను అందించనున్నారు. ఈ విధానం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు అవసరమైన పోస్టల్ సేవలను సులభంగా అందించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్న యువతకు, అలాగే కొత్తగా చిన్న వ్యాపారం ప్రారంభించాలని...