BRS: గెలుపే లక్ష్యంగా సింగరబోయిన రమా రాజశేఖర్ ప్రచారం
BRS: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ రాజకీయ వాతావరణం రోజు రోజుకీ మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సింగరబోయిన రమా రాజశేఖర్ గురువారం చేపట్టిన ప్రచారం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు కొనసాగుతుందన్నారు. దీంతో వార్డంతా గులాబీ జెండాల రంగుల్లో ముస్తాబైంది. పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రచారం ఉత్సాహంగా, హోరెత్తిన నినాదాలతో సాగింది. ఈ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రమా రాజశేఖర్‌కు అండగా నిలుస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత...