IND vs AFG U19: వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్

IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత అండర్-19 జట్టు అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 41.1 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం ఖాయం కావడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. కీలక సెమీఫైనల్‌లో ఇంత దూకుడుగా లక్ష్యాన్ని ఛేదించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ ఆరంభంలో టాస్ గెలిచిన ఆఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు...