ఈగ దామోదర్‌ను గెలిపించే బాధ్యత మీది

అభ్యర్థితో కలిసి శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకుల చేరిక కాంగ్రెస్‌కే మద్దతు తెలుపుతామంటున్న పట్టణ ప్రజలు బీఆర్ఎస్ ముఖ్య నాయకుల చేరికలతో పెరిగిన కాంగ్రెస్ బలం : ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నాగరాజు స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 11వ వార్డు అభ్యర్థి ఈగ దామోదర్‌కు మద్దతుగా బుధవారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు స్వయంగా ఈ ప్రచారంలో పాల్గొని ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. చేతి గుర్తుకు ఓటు...