Andhra Pradesh: అమరావతికి బిల్ గేట్స్!
Andhra Pradesh: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసిన మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానుండటం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం తెచ్చిపెడుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న కాలం నుంచే బిల్ గేట్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసిన సమయంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో చంద్రబాబు నాయుడు ఏర్పరచుకున్న అనుబంధం తెలిసిందే. ఇప్పుడు అదే అనుభవాన్ని అమరావతి...